Petrol Tanker Overturns | హైవేపై పెట్రోల్​ ట్యాంకర్​ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Petrol Tanker Overturns | హైదరాబాద్ – విజయవాడ హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. హయత్ నగర్​ (Hayath Nagar) సమీపంలోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద కారుపై ట్యాంకర్ బోల్తా పడింది.

ఇండియన్ ఆయిల్‌ (Indian Oil)కు చెందిన పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి ముందుగా వెళ్తున్న 2 కార్లను బలంగా ఢీకొంది. అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా.. అందులోని ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Petrol Tanker Overturns | పెట్రోల్ లీక్..

ప్రమాదం అనంతరం ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అయింది. దీంతో మంటలు అంటుకుంటే పెద్ద ప్రమాదం జరుగుతుందని వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ట్యాంకర్​లో ఇరుక్కుపోయిన డ్రైవర్​ను రక్షించారు.

Petrol Tanker Overturns | ట్రాఫిక్​ మళ్లింపు

ట్యాంకర్​ బోల్తా పడటంతో జాతీయ రహదారి 65పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్యాంకర్​ నుంచి పెట్రోల్ లీకేజీ కావడం, ట్రాఫిక్​ జామ్​ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వాహనాలను దారి మళ్లించారు.

దీనిని కూడా చదవండి: Ameerpet Fire Accident | అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో రోడ్డు బ్లాక్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *