అక్షరటుడే, వెబ్‌డెస్క్ : NEET Exam | దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ రీ ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే. ఎంతో మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అయ్యారు. అయితే ఒక్క నిమిషం నిబంధనతో ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నీట్ ఎగ్జామ్ సెంటర్ తెలియక కంగారు పడుతున్న విద్యార్థినిని ఓయూ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ తన వాహనంలో ఎక్కించుకుని సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి పంపించారు. దీంతో ఆమె పరీక్ష రాసింది. ఓ విద్యార్థిని పొరపాటున వేరే పరీక్షా కేంద్రానికి చేరుకుంది. ఆమె తన తండ్రితో కలిసి వచ్చింది. ఆయన వద్ద వాహనం కూడా లేదు. దీంతో పరీక్ష కేంద్రానికి బస్సులో వెళ్తే ఆలస్యం అవుతుందని ఆందోళనకు గురైంది. నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించరు.
NEET Exam | ఇన్స్పెక్టర్ సాయంతో..

విద్యార్థిని విషయం తెలుసుకున్న ఓయూ ఇన్స్పెక్టర్ మహేశ్‌కుమార్ గౌడ్ వెంటనే స్పందించారు. ఆమెను పోలీసు వాహనంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. దీంతో సకాలంలో ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్న విద్యార్థి పరీక్ష రాసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇన్స్పెక్టర్ను అభినందిస్తున్నారు. కాగా ఆయన స్పందించకుంటే ఆ విద్యార్థిని ఈ ఏడాది పరీక్షకు దూరం అయ్యేది. ఫలితంగా ఏడాది చదువుకు దూరం అయ్యేది.
In a heartwarming gesture, by Inspector, OU Police Station of @hydcitypolice, help a #NEET Aspirant, reach Examination Center on Time.
A #NEETaspirant was panicking at Osmania University limits, by mistake she had reached a different exam center and her parent… pic.twitter.com/XBq2mHMeVL
— Surya Reddy (@jsuryareddy) June 21, 2026
దీనిని కూడా చదవండి : KTR Sensational Comments | రాష్ట్రంలో మంత్రుల మాఫియా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు