అక్షరటుడే, వెబ్‌డెస్క్: Qatar Ras Laffan Explosion | ఖతార్ (Qatar)లోని రస్‌లఫాన్ చమురు ఎక్స్‌పోర్టు టెర్మినల్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది తీవ్రంగా గాయపడగా, మరో 18 మంది ఆచూకీ లభించలేదు. భారత్‌కు ముడిచమురు సరఫరా చేసే ఈ కీలక కేంద్రంలో ప్రమాదం జరగడం ఖతార్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ (Industrial City)లో పేలుడు ‘సాంకేతిక లోపం’ వల్లే సంభవించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖతార్‌లోని ప్రధాన ద్రవీకృత సహజ వాయువు శుద్ధి కర్మాగారంలో జరిగిన పేలుడులో 54 మంది గాయపడగా, మరో 18 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
Qatar Ras Laffan Explosion | సహాయక చర్యలు

రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన పేలుడు తర్వాత గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టేందుకు ఖతారీ అంతర్జాతీయ శోధన, సహాయక బృందాన్ని రంగంలోకి దించినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఈ ఘటనకు సాంకేతిక లోపమే కారణమని పేర్కొన్నప్పటికీ, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రిత్వ శాఖ ఎలాంటి సమాచారం అందించలేదు. ఈ పారిశ్రామిక కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఖతార్ ఎనర్జీ, బర్జాన్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన వెంటనే అత్యవసర సహాయక బృందాలను రంగంలోకి దించినట్లు, కర్మాగారంలో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది. దోహాకు ఉత్తరాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ, ప్రపంచంలోనే అతిపెద్ద LNG ఎగుమతి కేంద్రానికి నిలయంగా ఉంది. ఇది ప్రపంచ సరఫరాలో దాదాపు ఐదవ వంతును ఉత్పత్తి చేస్తుంది.
ఇది కూడా చదవండి..: US Iran Peace Talks | అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం.. విఫలమైతే దాడులు చేస్తామన్న ట్రంప్