అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sisters Missing Case | తల్లి మందలించిందని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలో చోటు చేసుకుంది.
నగరంలోని పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు నిత్యం ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. ఫోన్‌కు బానిస కావడంతో వారిని ఇటీవల తల్లి మందలించింది. దీంతో ముగ్గురు కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ముగ్గురు బిడ్డలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Sisters Missing Case | ఏలూరులో ఆచూకీ లభ్యం
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్.శ్రీనివాస్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, అర్ధరాత్రి వరకు స్టేషన్‌లోనే ఉండి దర్యాప్తును పర్యవేక్షించారు. సీసీ కెమెరాలు, సాంకేతికత సాయంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఏలూరులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వారిని సురక్షితంగా రక్షించి, తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి..: DTO Venkanna Death | డీటీవో మృతిపై విచారణకు ఆదేశం : మంత్రి పొన్నం