అక్షరటుడే, వెబ్డెస్క్ : Coaching Center Fire | ఉత్తరప్రదేశ్ (UP)లోని లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది.
లక్నోలోని అలీగంజ్ (Aligunj) ప్రాంతంలో ఒక కోచింగ్ సెంటర్ ఉన్న మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో సోమవారం అగ్నిప్రమాదంలో జరిగింది. కోచింగ్ సెంటర్లో మంటలు అంటుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకోవడానికి పలువురు భవనంపై నుంచి కిందకు దూకారు. ఎనిమిది మంది విద్యార్థులు భవనం నుండి దూకగా, మరికొందరు లోపల చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Coaching Center Fire | కొనసాగుతున్న సహాయక చర్యలు
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. భవనంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ అగ్నిప్రమాద స్థలాన్ని సందర్శించారు. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలు సవాలుగా మారడంతో, అగ్నిమాపక సిబ్బంది పక్కనే ఉన్న భవనంలోని గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించానేజ
Coaching Center Fire | విచారణకు ఆదేశం
మూడు అంతస్తుల భవనంలో కింది అంతస్తులో పెంపుడు జంతువుల దుకాణం, పై అంతస్తులో యానిమేషన్ సెంటర్ ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రమాదంలో విద్యార్థుల మృతిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
దీనిని కూడా చదవండి : NEET Re Exam Scam | నీట్ రీ ఎగ్జామ్లో స్కామ్.. 30 మంది అరెస్ట్