Robotic Surgery | కామారెడ్డిలో అధునాతన రోబోటిక్, ఎండోయూరాలజీ సేవలు ప్రారంభం..

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Robotic Surgery | కామారెడ్డి (Kamareddy)లో అధునాతన రోబోటిక్, ఎండోయూరాలజీ సేవలు ప్రారంభించడం జరిగిందని సోమాజిగూడ యశోద ఆస్పత్రి యూరాలజిస్ట్ గోపిచంద్ తెలిపారు. గురువారం ఆయన కామారెడ్డి యశోద బ్రాంచ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక ఆరోగ్య సేవలను మెరుగుపరిచే దిశగా యశోద హాస్పిటల్స్ (Yashoda Hospitals) సోమాజిగూడ కీలక అడుగు వేసిందన్నారు. కామారెడ్డి, పరిసర జిల్లాల ప్రజల కోసం అత్యాధునిక ప్రెసిషన్ రోబోటిక్, ఎండోయూరాలజీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.

Robotic Surgery | గ్రామీణ, సెమీ-అర్బన్ తెలంగాణలో..

గ్రామీణ, సెమీ-అర్బన్ తెలంగాణలో పెరుగుతున్న కిడ్నీ, మూత్రపిండ, ప్రొస్టేట్ వ్యాధులకు మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. Da Vinci Xi రోబోటిక్ సిస్టమ్‌తో చికిత్స అందిస్తామని అయన వెల్లడించారు. ప్రొస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్‌లకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ చికిత్స తక్కువ రక్తస్రావం, చిన్న కోతలు, త్వరగా కోలుకోవడం, ఆస్పత్రిలో ఉండే సమయం తగ్గడం ద్వారా రోబోటిక్ చేతులు మనిషి చేతిని అనుకరిస్తూ, మరింత కదలికతో కచ్చితమైన సర్జరీ చేస్తాయన్నారు.

కోతలు లేకుండా శరీరంలోని సహజ రంధ్రాల ద్వారా చికిత్స చేసే మచ్చలేని విధానం అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. కిడ్నీలో రాళ్లకు ఫ్లెక్సిబుల్ స్కోప్, లేజర్‌తో చికిత్స వల్ల పెద్ద కోత అవసరం లేదన్నారు. ఆధునిక యూరాలజీ అంటే పెద్ద కోతలు, ఎక్కువ కాలం కోలుకోవాల్సిన అవసరం లేదన్నారు. రోబోటిక్, ఎండోయూరాలజీ నైపుణ్యాన్ని కామారెడ్డి ప్రజల వద్దకే తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి వైద్యం ఇక్కడే అందిస్తామని తెలిపారు. యశోద సోమాజిగూడ యూరాలజీ విభాగం సర్జికల్ సర్వరీ పద్ధతుల ద్వారా తక్కువ నొప్పి, వేగవంతమైన కోలుకోవడంపై దృష్టి పెడుతోందన్నారు. ఈ సమావేశంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: DSP Promotion | పుప్పాల శ్రీశైలంకు డీఎస్పీగా పదోన్నతి

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *