Rayadurgam Land Issue | రాయదుర్గం భూవివాదం కొలిక్కి.. హైకోర్టు పిటిషన్ వెనక్కి తీసుకోనున్న SBI

రాయదుర్గంలోని ఐదు ఎకరాల భూమికి సంబంధించిన వివాదాస్పద అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rayadurgam Land Issue | రాష్ట్ర సచివాలయంలో ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రతినిధులు, మెట్రోరైల్ అధికారులు సమావేశమయ్యారు. రాయదుర్గంలో ఉన్న ఐదు ఎకరాల భూమి అంశం, అలాగే మెట్రోరైల్ ఫేజ్-1 ఆస్తుల విలువ నిర్ధారణకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో సన్నాహక చర్చలు నిర్వహించారు.

School Kitchen Shed | బడి రుణం.. తమ్ముడి స్మరణం: సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి అక్షరార్చన!

Rayadurgam Land Issue | వివాదాస్పద అంశంపై చర్చ

మెట్రోరైల్ తొలి దశ ప్రాజెక్టు విలువను అంచనా వేయడం (వాల్యుయేషన్) కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, SBI ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాయదుర్గంలోని ఐదు ఎకరాల భూమికి సంబంధించిన వివాదాస్పద అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

సమావేశంలో SBI ప్రతినిధులు తమ వైఖరిలో సానుకూల మార్పు చూపినట్లు తెలిసింది. రాయదుర్గం భూమి అంశానికి సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వారు సీఎస్‌కు తెలియజేశారు.

Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

Rayadurgam Land Issue | త్వరలోనే పూర్తి స్థాయి పరిష్కారం

అదేవిధంగా, SBIకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సమావేశంలో వెల్లడైంది. దీంతో రాయదుర్గం భూమి వ్యవహారానికి త్వరలోనే పూర్తి స్థాయిలో పరిష్కారం లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ ప్రక్రియ, భూమి అంశాల పరిష్కారం నేపథ్యంలో ప్రభుత్వం, SBI, మెట్రోరైల్ సంస్థల మధ్య సమన్వయం మరింత బలపడనున్నట్లు తెలుస్తోంది.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *