అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kashmir Tour Package | ఇండియన్ రైల్వే (Indian Railways) క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ‘అల్టిమేట్ కాశ్మీర్: ది ప్యారడైజ్ ఆన్ ఎర్త’ పేరుతో తీసుకువచ్చిన ఈ ప్యాకేజీలో శ్రీనగర్, సోనామార్గ్, గుల్మార్గ్ పహల్గామ్ వంటి ప్రాంతాలను చూసి రావొచ్చు.
ఇది 5 రాత్రులు, 6 పగళ్లు సాగే విమాన యాత్ర. ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ విమాన ప్రయాణ ప్యాకేజీ ఆగస్టు 28న గౌహతి నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 2 పర్యటన ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకుందామా..
శ్రీనగర్ : శ్రీనగర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో షికారా సవారీ ఉంటుంది. అలాగే మొఘల్ గార్డెన్స్, నిషాత్ బాగ్ వంటి చారిత్రక ఉద్యానవనాలను చూపిస్తారు.
సోనామార్గ్ : దీనిని మంచు పచ్చిక భూమి అని పిలుస్తారు. ఇక్కడి హిమానీనదాలు, ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.
గుల్మార్గ్ : పువ్వుల పచ్చిక భూమిగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్ (గోండోలా) రైడ్ అందుబాటులో ఉంది.
పహల్గామ్ : అందమైన లోయలు నదీ తీరాలతో అలరారే పహల్గామ్ పర్యటన కూడా ఈ ప్యాకేజీలో భాగం.
Kashmir Tour Package | ప్యాకేజీ వివరాలు..
ఇండిగో ఎయిర్‌లైన్స్ ద్వారా విమాన ప్రయాణం, హోటల్ వసతి, భోజనం, స్థానికంగా సందర్శించడానికి రవాణా సౌకర్యాలు కూడా ఈ ప్యాకేజీలో యాడ్ చేశారు.
ముగ్గురు వ్యక్తుల షేరింగ్‌కు ఒక్కొక్కరికి రూ. 34,000.
ఇద్దరు వ్యక్తులు పంచుకుంటే ఒక్కొక్కరికి రూ. 35,350.
ఒక్కరే ప్రయాణిస్తే రూ. 40,210.
5-11 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు మంచంతో కలిపి రూ. 27,690, మంచం లేకుండా రూ. 25,640.
Kashmir Tour Package | బుకింగ్ ప్రక్రియ:
ఈ ప్యాకేజీలో 20 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న పర్యాటకులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా సమీపంలోని ఐఆర్‌సీటీసీ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా {కెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..: Trump India Remarks | భారత్‌ను నరకంతో పోలుస్తూ ట్రంప్ పోస్ట్

