అక్షరటుడే వెబ్డెస్క్: Antyodaya Anna Yojana | దేశంలోని అత్యంత పేద కుటుంబాలకు ఉద్దేశించిన ‘అంత్యోదయ అన్న యోజన’ (AAY) పథకంలో సమూల మార్పులు చేసేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సిద్ధమైంది. దీని కోసం ‘నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ (అమెండ్మెంట్) బిల్లు, 2026’ ముసాయిదాను విడుదల చేసింది.
Antyodaya Anna Yojana | ప్రస్తుతం ఉన్న విధానం..
ప్రస్తుతం అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి, వారిలో ఎంతమంది సభ్యులు ఉన్నా సరే, నెలకు స్థిరంగా 35 కిలోల రేషన్ ఇస్తున్నారు. దీనివల్ల చిన్న కుటుంబాలకు ఎక్కువ, పెద్ద కుటుంబాలకు తక్కువ ధాన్యం అందుతోందనే అసమానతలు ఉన్నాయి.

Antyodaya Anna Yojana | కొత్త ప్రతిపాదనలు ఇవే..
ఇకపై కుటుంబం మొత్తం మీద కాకుండా, కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోల చొప్పున రేషన్ కేటాయిస్తారు. కుటుంబంలో సభ్యుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ, ఒక కుటుంబానికి నెలకు గరిష్టంగా 35 కిలోలకు మించి రేషన్ ఇవ్వరు. ఒకవేళ మీ కుటుంబంలో 5 కంటే తక్కువ మంది సభ్యులు ఉంటే, కొత్త నిబంధన ప్రకారం రేషన్ తగ్గుతుంది. ఉదాహరణకు, ముగ్గురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఇప్పుడు 35 కిలోలు వస్తుంటే, కొత్త విధానంలో 21 కిలోలు మాత్రమే అందుతాయి.
Antyodaya Anna Yojana | మార్పుకు కారణం..
రేషన్ పంపిణీలో ఉన్న అసమానతలను తొలగించి, పారదర్శకతను తీసుకురావడానికి , లబ్ధిదారులకు సమానంగా ఆహార ధాన్యాలు అందేలా చేయడానికి ఈ సవరణలు తెస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ముసాయిదా బిల్లుపై ప్రజలు, ఇతర వర్గాల నుండి ప్రభుత్వం సలహాలను ఆహ్వానిస్తోంది. ఒకవేళ మీకు ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే 2026 జులై 13వ తేదీ లోగా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖకు సమర్పించవచ్చు.
ఇది కూడా చదవండి: Passport Citizenship Proof | పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: కేంద్రం కీలక వివరణ