అక్షరటుడే, హైదరాబాద్: Yellow Alert | తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపగా, ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. రాజధాని హైదరాబాద్ (Hyderabad) సహా పలు జిల్లాల్లో రాబోయే రెండు మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.
Yellow Alert | హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్:
నగరంలోని పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ (Meteorological Department) ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Yellow Alert | వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాలు:
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోనూ వర్ష ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ (ADB), కామారెడ్డి, కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్.
జనగాం, మేడ్చల్ – మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్.
రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి.
Yellow Alert | అధికారుల హెచ్చరికలు:
గాలి వేగం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున విద్యుత్ స్తంభాల కింద, చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. మబ్బులు కమ్ముకోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆకస్మిక వాతావరణ మార్పులతో ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Cyber Crime Control | సైబర్ నేరాల నియంత్రణకు సహకరించాలి : సీపీ సజ్జనార్

