అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: SIR Voter Survey | ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ (Bigala Ganesh) అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో బీఎల్వోల నుంచి ఎన్యూమరేషన్ పత్రాలను బిగాల స్వీకరించారు.
SIR Voter Survey | పారదర్శకంగా ఓటరు జాబితా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అర్హత కలిగిన ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ పత్రాన్ని పూర్తిగా, సరైన వివరాలతో నింపి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి, నిర్ణీత గడువులోగా సంబంధిత బీఎల్వోల లేదా ఎన్నికల అధికారులకు అందజేయాలని కోరారు.
SIR Voter Survey | ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి..

ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. చిన్న నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో ఓటు నమోదు, సవరణ లేదా ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ప్రతి కుటుంబం ఈ ప్రక్రియను సీరియస్‌గా తీసుకుని, ఇంట్లోని ప్రతి అర్హత కలిగిన ఓటరుకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయించాలని సూచించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలందరూ ఎన్నికల సంఘానికి సహకరిస్తూ ఈ సర్వేను విజయవంతం చేయాలని, అలాగే తమ బంధువులు, స్నేహితులు, పొరుగువారిలో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించేలా సహకరించాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Voter Enumeration Forms | ప్రతీ ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలివ్వాలి