Yogi Adityanath | కాంగ్రెస్​ దేశాన్ని ముక్కలు చేసింది : యూపీ సీఎం ఆదిత్యానాథ్​

ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దేశాన్ని కేవలం దోచుకోవడమే కాదు, ముక్కలు చేసిందని విమర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Yogi Adityanath | ఉత్తర ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ (UP CM Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దేశాన్ని కేవలం దోచుకోవడమే కాదు, ముక్కలు చేసిందని విమర్శించారు.

ఒక వర్గం వారు శ్రీరాముడి ఉనికినే లేదని వాదించేవారు, అంటే వారు అయోధ్య ఉనికిని కూడా అంగీకరించడానికి ఇష్టపడలేదని యోగి అన్నారు. వారు కోర్టులో నిరంతరం పోరాటం సాగించారని, రామ జన్మభూమి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి న్యాయవాదుల సైన్యాన్నే రంగంలోకి దించారని విమర్శించారు. ‘జై శ్రీరామ్’ అని నినదించేవారిపై లాఠీలు ఝుళిపించి, కాల్పులు జరిపిన వారు ఉన్నారని మండిపడ్కడారు. వారే ఇప్పుడు విశ్వాసంతో చెలగాటం ఆడుతున్నారని మాట్లాడుతున్నారన్నారు.

Yogi Adityanath | అల్లర్లకు కారణమయ్యారు

కొందరు రామ నవమి నాడు అల్లర్లు రేకెత్తించేవారు, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిషేధించేవారు, కాన్వార్ యాత్రను అడ్డుకునేవారు, దుర్గా పూజ సమయంలో అల్లర్లకు కారణమయ్యేవారని యూపీ సీఎం పేర్కొన్నారు. అటువంటి అప్రామాణికత, అవినీతి రికార్డులు సృష్టించిన వారే ఇప్పుడు అయోధ్య విషయంలో ఆరోపణలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ఉందని, అన్నీ అందరి ముందు ఉంచుతామని పేర్కొన్నారు. ఆయోధ్య ట్రస్ట్​ నిధుల అవకతవకాల ఆరోపణలపై ఆయన ఈ విధంగా స్పందించారు.

Yogi Adityanath | ఆధారాలుంటే ఇవ్వండి

రామ భక్తుల సహనాన్ని పరీక్షించకండని సీఎం అన్నారు. వాస్తవాలు, ఆధారాలు లేకపోతే, ఆరోపణలు-ప్రతి ఆరోపణలు ఆపేయాలన్నారు. ఒకవేళ ఆధారాలు ఉంటే, వాటిని SIT (ప్రత్యేక దర్యాప్తు బృందం) ముందు ఉంచాలని సూచించారు. SIT సిఫార్సుల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. సీనియర్ అధికారుల బృందం పని చేస్తోందోని, దీనిపై రాజకీయ ప్రకటనలు చేయడం మానేయండని హితవు పలికారు.

Yogi Adityanath | కేజ్రీవాల్​పై విమర్శలు

Yogi Adityanath

ఢిల్లీకి చెందిన ఒక పెద్దమనిషి (అరవింద్ కేజ్రీవాల్) కూడా అయోధ్యకు వచ్చారని యోగి అన్నారు. ఢిల్లీ ప్రజలు ఆయనకు ఎన్నో ఏళ్లుగా అవకాశాలు ఇచ్చారని, అయితే అవినీతి తప్ప ఆయన మరేమీ ఇవ్వలేదని విమర్శించారు. అయోధ్య విషయంలో ‘డబుల్ ఇంజిన్’ బీజేపీ ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధినే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ విషయంలోనూ ప్రదర్శిస్తే, అయోధ్య ధామంలాగే ఢిల్లీ కూడా అద్భుతంగా వెలిగిపోయేదన్నారు.

ఇది కూడా చదవండి..: Operation Sindoor Heroes | ఆపరేషన్‌ సిందూర్‌ అమరవీరుల వివరాలు వెల్లడి.. ప్రభుత్వం కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *