నిజామాబాద్Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి..కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్

Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి..కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.

అక్షరటుడే, లింగంపేట: Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు. లింగంపేట మండలం అయ్యప్పపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు.

Paddy Procurement | కేంద్రాల్లో ఇబ్బందులు రావొద్దు..

ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం, తేమ శాతం పరీక్ష, గన్నీ బ్యాగుల లభ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వరి సేకరణకు సంబంధించిన సివిల్ సప్లయ్స్​ (Civil Supplies)​, మార్కెటింగ్, ఐకేపీ, పీఏసీఎస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తూకం జరగగానే ధాన్యం సొమ్ము చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఓపీఎంఎస్​ ట్యాబ్​ (OPMS Tab)లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని చెప్పారు. నమోదులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Additional DCP | బాధ్యతలు స్వీకరించిన అదనపు డీసీపీ శుభం ప్రకాశ్​

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...