IND vs IRE | ఐర్లాండ్ సంచలనం.. పసికూన చేతిలో టీమిండియా పరాజయం

మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐర్లాండ్ ప్లేయర్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో అద్భుతంగా రాణించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs IRE | అంతర్జాతీయ క్రికెట్‌లో మరో పెను సంచలనం నమోదైంది. పసికూనగా భావించే ఐర్లాండ్ జట్టు బలమైన టీమిండియాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.

ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో భారత జట్టు సరికొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఓటమితోనే తన సిరీస్‌ను ప్రారంభించాల్సి వచ్చింది.

School Kitchen Shed | బడి రుణం.. తమ్ముడి స్మరణం: సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి అక్షరార్చన!

IND vs IRE | చేతులెత్తేసిన టీమిండియా బ్యాటర్లు

మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐర్లాండ్ ప్లేయర్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో అద్భుతంగా రాణించారు.

అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చేతులెత్తేసింది. భారత ఆటగాళ్లు అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ ఘోరంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాటింగ్ లైన్అప్ కుప్పకూలడంతో టీమిండియా 148 పరుగులకే పరిమితమై పరాజయాన్ని మూటగట్టుకుంది.

NEET Exam Pressure | విద్యార్థుల గుండెల్లో ‘ఒత్తిడి’ చిచ్చు.. ఊపిరి తీస్తున్న ‘మెడికల్’ కల!

IND vs IRE | అయ్యర్ కెప్టెన్సీ డెబ్యూకు నిరాశే..

టీ20 కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌కు ఈ ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది. పూర్తి స్థాయి కొత్త జట్టుతో బరిలోకి దిగిన భారత్‌ను ఐర్లాండ్ వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్ తదుపరి మ్యాచ్‌లో పుంజుకుంటుందో లేదో చూడాలి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *