HYDRAA Alwal Demolitions | అల్వాల్​లో హైడ్రా కూల్చివేతలు

అల్వాల్‌లో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 108 ఎకరాల్లో ఆక్రమణలు తొలగిస్తోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: HYDRAA Alwal Demolitions | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, నాలాలతో పాటు ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. తాజాగా అల్వాల్​లో 108 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం భారీ ఆపరేషన్​ చేపట్టింది.

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాలోని అల్వాల్‌లోని సర్వే నెం.1లో శనివారం తెల్లవారుజామున హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. భారీ పోలీస్ బందోబస్తు, DRF బలగాల మధ్య అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. ఇక్కడ 108 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది.

HYDRAA Alwal Demolitions | నాయకుల హస్తం

HYDRAA Alwal Demolitions

అల్వాల్​లోని 108 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రతిపక్ష నేతలు, మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధుల అండదండలతోనే కబ్జా చేసి అమ్మకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇక్కడ పలు నిర్మాణాలు వెలిశాయి. అన్యాక్రాంతమైన ఈ భూమిని కాపాడేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సమక్షంలో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Donald Trump Avenue | భారత్​కు ట్రంప్​ కృతజ్ఞతలు.. ఎందుకో తెలుసా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *