Idupu Kayitham Controversy 1 | ‘ఇడుపు కాయితం’ వివాదం అనవసరం.. సినిమాను సినిమాగానే చూడాలి: సీనియర్ నటుడు నరేశ్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Idupu Kayitham Controversy 1 | ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. అయితే సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో కొందరు చేసిన పోస్టులు వివాదానికి దారితీశాయి.

ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేశ్ స్పందిస్తూ, సినిమా పేరును అనవసరంగా వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. సినిమాను సినిమాగానే చూడాలని, ప్రతి అంశాన్ని వివాదంగా మార్చడం మంచిది కాదని సూచించారు.

Telangana Telugu History | ఆంధ్రుల భాష ‘ఆంధ్రం’… మనది ‘జాన తెలుగు’!: “ఇడుపు కాయితం” Title లొల్లి వేళ ఆకట్టుకుంటున్న ప్రొఫెసర్ దంటు కనకదుర్గ విశ్లేషణ

Idupu Kayitham Title

Idupu Kayitham Controversy 1 | ‘కరుప్పు’, ‘కాంతార’ వంటి పేర్ల అర్థాలు

ఇతర భాషల చిత్రాలైన ‘కరుప్పు’, ‘కాంతార’ వంటి పేర్ల అర్థాలు అందరికీ తెలియకపోయినా ప్రేక్షకులు వాటిని ఆదరించి విజయవంతం చేశారని గుర్తుచేశారు. అదే విధంగా ‘ఇడుపు కాయితం’ చిత్రాన్ని కూడా ముందస్తు అభిప్రాయాలతో కాకుండా, సినిమా విడుదలైన తర్వాత చూసి అంచనా వేయాలని అన్నారు.

టైటిల్‌పై కొనసాగుతున్న వివాదానికి ఇక్కడితో ముగింపు పలికి, తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించే దిశగా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నరేశ్ పిలుపునిచ్చారు.

Idupu Kayitham controversy | ‘ఇడుపు కాయితం’ వివాదం: రేవంత్‌, బీఆర్ఎస్‌లపై ధ్వజమెత్తిన కవిత.. పవన్‌ను అడగాలంటూ ఎద్దేవా!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *