Assam Floods | అస్సాంలో వర్ష బీభత్సం.. భారీ నష్టం

అస్సాం, అరుణాచల్​ ప్రదేశ్​ రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Assam Floods | అస్సాం, అరుణాచల్​ ప్రదేశ్​ రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయిన నేపథ్యంలో వరద పరిస్థితిని, నష్టాన్ని సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వరదలతో అతలాకుతలమైన రాష్ట్రాలకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ధేమాజీలో సోమవారం భారీ వర్షాల కారణంగా జోనైలోని లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు వరద నీటితో మునిగిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కనీసం 12 జిల్లాలను అతలాకుతలం చేయగా, అస్సాంలోని ఐదు జిల్లాల్లో దాదాపు 45,000 మంది ప్రజలు ప్రభావితులయ్యారు. రాబోయే ఐదు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Assam Floods | నలుగురిని రక్షించిన ఐఏఎఫ్​

దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని సిసిరి నదిలో ఒక ద్వీపంలో నలుగురు చిక్కుకుపోవడంతో, భారత వైమానిక దళం (ఐఏఎఫ్) హెలికాప్టర్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. వర్షాల కారణంగా రోయింగ్-అనిని రహదారి కూడా తీవ్రంగా దెబ్బతింది, అనేక చోట్ల ఆకస్మిక వరదలు రోడ్లు, వంతెనలను కొట్టుకుపోయాయి. తూర్పు సియాంగ్‌లోని ఎనిమిది ప్రధాన రోడ్లను వరద ముంచెత్తింది. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Assam Floods | నీట మునిగిన గ్రామాలు

Assam Floods

అస్సాంలో వరదల వల్ల ప్రభావితమైన 45,000 మందిలో, అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న ధేమాజి జిల్లాలో 41,000 మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ తర్వాత దిబ్రూగఢ్‌లో దాదాపు 4,000 మంది, చిరాంగ్‌లో దాదాపు 800 మంది ప్రభావితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 257 గ్రామాలు నీట మునిగిపోగా, 4,278.52 హెక్టార్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. వరదల ధాటికి ధేమాజీలో సిమెన్ నదిపై ఉన్న రైల్వే వంతెనలో కొంత భాగం కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇది కూడా చదవండి..: Nitin Nabin | డ్రగ్స్​కు దూరంగా ఉండాలి.. యువతకు నితిన్​ నబిన్​ సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *