E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై క్లారిటీ.. వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందేనన్న కేంద్రం

దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపే (E20) కార్యక్రమం ప్రస్తుతం కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: E20 Petrol | దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపే (E20) కార్యక్రమం ప్రస్తుతం కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ( Supreme Court )  తెలిపింది. వాహనాల పనితీరు తగ్గడం , మైలేజీపై వస్తున్న ఆందోళనల నేపథ్యంలో, వచ్చే ఏడాది నాటికి దీని ఫలితాలు , ప్రభావం స్పష్టంగా తెలుస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

E20 Petrol | సరఫరాదారులకు అనుకూలంగా..

ఇథనాల్ సరఫరా ఒప్పందాల విషయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ కొనుగోళ్లను తగ్గించడాన్ని సవాలు చేస్తూ డిస్టిలరీ కంపెనీలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సరఫరాదారులకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా, ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ‘బీపీసీఎల్’ (BPCL) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపించారు.

E20 Petrol | ప్రయోగాత్మక పరిశీలన..

ఈ20 పెట్రోల్ విధానం పర్యావరణహితమైనదని, ఇంధన భద్రతకు దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే, దీని పూర్తిస్థాయి ప్రభావంపై పరిశీలన ఇంకా కొనసాగుతోందని, వచ్చే ఏడాదికి ఫలితాలు వెల్లడవుతాయని వివరించారు.

E20 Petrol | కేసులు పెరిగే అవకాశం ఉందని..

హైకోర్టు ఉత్తర్వుల వల్ల ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కేసులు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ20 పాలసీకి విఘాతం కలుగుతుందని అటార్నీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే అక్టోబర్‌లోపు సప్లై కాంట్రాక్టులు రెన్యువల్ కావాల్సి ఉన్నందున, ఈ గడువులోపు స్పష్టత కోసం కోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఇథనాల్ సరఫరా అనేది మార్కెట్ డిమాండ్ , లభ్యతను బట్టి మారుతుందని, కంపెనీలు ఆ ప్రకారమే వ్యవహరిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదికూడా చదవండి:  Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *