అక్షరటుడే, ఎల్లారెడ్డి: IGP Chandrashekhar Reddy | పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణ న్యాయం అందించాలని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌ను (Yellareddy Police Station) సందర్శించారు. ఎస్పీ రాజేష్ చంద్రతో(SP Rajesh Chandra) కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
IGP Chandrashekhar Reddy | రికార్డుల పరిశీలన
అనంతరం స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, మాల్ఖానా, ఆయుధాల భద్రత, స్టేషన్ రికార్డులు, రిసెప్షన్, సీసీటీఎన్‌ఎస్ నిర్వహణను ఐజీ పరిశీలించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, మిస్సింగ్, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, అండర్ ఇన్వెస్టిగేషన్, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక దృష్టితో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి కేసుకు స్పష్టమైన ‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’ రూపొందించాలని సూచించారు.
IGP Chandrashekhar Reddy | సాంకేతికత వినియోగంపై దృష్టి..
సీసీటీఎన్‌ఎస్–2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్(TS-COP), హెచ్‌ఆర్‌ఎంఎస్ వంటి డిజిటల్ సేవలపై పూర్తి అవగాహన పెంచుకొని నేరాల నియంత్రణ, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. పాపిలాన్ పరికరం ద్వారా అనుమానితుల వేలిముద్రలను తనిఖీ చేసి పాత నేరస్తులను గుర్తించే చర్యలను విస్తృతం చేయాలని పేర్కొన్నారు.
IGP Chandrashekhar Reddy | ఫిర్యాదుదారులతో మర్యాదగా మెలగాలి..
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని ఐజీ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని, సత్వర పరిష్కార చర్యలు చేపట్టడం ద్వారా పోలీసు-ప్రజా సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు. ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్‌లైన్‌లో, కేసు వివరాలను నిర్ణీత గడువులోగా సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా, బీట్ పోలీసింగ్ పటిష్టం చేయాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకునేలా చూడాలని సూచించారు. విలేజ్ పోలీసింగ్ అధికారులు గ్రామాలను తరచూ సందర్శించి సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. రాత్రి గస్తీ, వాహన తనిఖీలు మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీతో పనిచేయాలని సూచించారు. ఎస్పీ రాజేష్ చంద్ర, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజారెడ్డి, ఎస్‌హెచ్‌వో రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్