Nallamala Jungle Safari | నల్లమలలో జంగిల్ సఫారీ మూసివేత

నల్లమలలో జంగిల్ సఫారీని అధికారులు మూసివేశారు. పులుల సంతానోత్పత్తి కాలం కావడంతో సెప్టెంబర్ 30 వరకు పర్యాటకులను అనుమతించమని తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nallamala Jungle Safari | నల్లమలలో జంగిల్ సఫారీని అధికారులు మూసివేశారు. పులుల సంతానోత్పత్తి కాలం కావడంతో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పర్యాటకులను అనుమతించమని తెలిపారు. ప్రస్తుతం ఈ రిజర్వ్‌లో 43 పెద్దపులులు ఉన్నట్లు వెల్లడించారు.

అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​లో పులులు, ఇతర వన్యప్రాణులను తిలకించేందుకు జంగిల్​ సఫారీని అధికారులు ప్రవేశ పెట్టారు. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఎంతో మంది అడవి అందాలు, వన్య ప్రాణులను తిలకించేందుకు జంగిల్​ సఫారీకి వస్తుంటారు. అయితే ప్రస్తుతం పులుల సంతానోత్పత్తి కాలం కావడంతో సఫారీని అధికారులు నిలిపి వేశారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 90 రోజులపాటు దేశంలోని 54 పెద్ద పులుల అభయారణ్యాల పరిధిలో నిషేధం ఉంటుంది. ఆత్మకూరు నల్లమలలో ఉన్న బైర్లూటి జంగిల్ సఫారీ, ఎకో టూరిజం కేంద్రాల ముసివేతకు డివిజన్ ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అపావ్ ఆదేశాలు జారీ చేశారు.

tiger reserve

Nallamala Jungle Safari | ఆ ఆలయానికి సైతం..

శ్రీశైల శిఖర సమీపంలో నుంచి వెళ్లే ఇష్టకామేశ్వరి ఆలయానికి భక్తుల రాకపోకల వాహనాలను సైతం అధికారులు నిలిపివేశారు. ఈ ఆలయం అడవిలో ఉంది. దీంతో పులులకు ఇబ్బంది కలగకుండా అధికారులు దర్శనాలను నిలిపివేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీప పచ్చర్ల, తుమ్మల బయలు జంగిల్ సఫారీలను మూసివేశారు. ప్రపంచంలో ఉన్న పెద్దపులులలో 50 శాతం భారతదేశంలో ఉన్నాయి. ఈ క్రమంలో వాటి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

దీనిని కూడా చదవండి : Revanth Reddy Review | ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కఠిన ఆదేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *