Ekana Stadium Fight | ఏకనా స్టేడియంలో రచ్చ.. చెప్పులతో కొట్టుకున్న అభిమానులు!

Naresh Chandan
Ekana Stadium Fight

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ekana Stadium Fight | లక్నోలోని Ekana Cricket Stadiumలో Indian Premier League మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Lucknow Super GiantsRajasthan Royals జట్ల మధ్య పోరు జరుగుతుండగా, స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు ఒక్కసారిగా గొడవకు దిగారు.

Ekana Stadium Fight | తీవ్ర హంగామా

ఒకరినొకరు తోసుకుంటూ, చెప్పులతో కొట్టుకుంటూ తీవ్ర హంగామా సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గొడవకు కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో స్టేడియంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, తర్వాత మ్యాచ్ యథావిధిగా కొనసాగింది. అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని వెల్లడించారు.

దీనిని కూడా చదవండి : Supreme Court | జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా ఓకే.. కానీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వద్దు: సుప్రీం జడ్జి

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *