TU UGC | తెయూ యూజీసీ అఫైర్స్ డైరెక్టర్​గా పాత నాగరాజు నియామకo

తెలంగాణ యూనివర్సిటీ యూజీసీ అఫైర్స్ డైరెక్టర్​గా అర్థశాస్త్ర విభాగం అసోసియేట్​​ ప్రొఫెసర్​ పాత నాగరాజు నియమితులయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: TU UGC | తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) యూజీసీ అఫైర్స్(UGC Affairs) డైరెక్టర్​గా అర్థశాస్త్ర విభాగం సహ ఆచార్యుడు పాత నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి ఉత్తర్వులు అందజేశారు.

TU UGC | గతంలో అర్థశాస్త్ర విభాగాధిపతిగా..

నాగరాజు గతంలో అర్థశాస్త్ర విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షుడిగా, ప్రిన్సిపల్​గా, ప్లేస్​మెంట్​ అండ్(Telangana Education) ట్రైనింగ్ సెల్ డైరెక్టర్​గా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్​గా బాధ్యతలు నిర్వహించారు. యూజీసీ అఫైర్స్ డైరెక్టర్​గా నియమితులైన డాక్టర్ నాగరాజుకు తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు. యూజీసీ అఫైర్స్ డైరెక్టర్ గా నియమించినందుకు వీసీ, రిజిస్ట్రార్​కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

tu 3

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *