అక్షరటుడే, వెబ్డెస్క్: Gachibowli Stadium | హైదరాబాద్లోని Gachibowli Stadium అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) విధానంలో ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Gachibowli Stadium | అత్యాధునిక సౌకర్యాలు..
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం, స్టేడియానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల భూమిలో 64 ఎకరాలను అత్యాధునిక క్రీడా సౌకర్యాల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఇందులో 21 రకాల క్రీడలకు అవసరమైన అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
అంతర్జాతీయ స్థాయి పోటీలు..
క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు అందించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయి పోటీలను నిర్వహించగలిగే విధంగా స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా క్రీడా రంగానికి కొత్త ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
PPP విధానంలో అభివృద్ధి చేయడం ద్వారా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఉపయోగించి వేగవంతమైన అభివృద్ధి సాధించవచ్చని మంత్రివర్గం అభిప్రాయపడింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన తదుపరి చర్యలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Retired Employees Benefits | ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం కోత.. రిటైర్డ్ ఉద్యోగులకు సర్దుబాటు

