అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kodad SI Suspended |సూర్యాపేట (Suryapet) జిల్లాలో కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్‌పై వేటు పడింది. ఈ మేరకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Kodad SI Suspended |డిప్యూటీ సీఎం ఫిర్యాదుతో..
ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కాన్వాయ్‌ను షెడ్యూల్ రూట్లో కాకుండా మరో మార్గంలో ఎస్సై గోపాల్ తీసుకెళ్లారు. ఈ ఘటనపై డీజీపీకి స్వయంగా డిప్యూటీ సీఎం ఫిర్యాదు చేశారు. జోనల్-2 ఐజీ, సూర్యాపేట ఎస్పీలను వివరణ కోరారు. ఎస్సై వ్యవహారంపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్సై గోపాల్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది.
దీనిని కూడా చదవండి : Telangana Heavy Rains | రైతులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన