అక్షరటుడే వెబ్‌డెస్క్: Anitha Radhakrishnan Arrest | తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై ( Vijay )వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు వ్యతిరేకంగా డీఎంకే ఎంపీ కనిమొళి గళం విప్పారు. జూన్ 20న మాజీ సీఎం కరుణానిధి జయంతి వేడుకల్లో భాగంగా జరిగిన ఒక సభలో అనితా రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సినీ నటుడు, ప్రస్తుత సీఎం విజయ్ రాజకీయ ప్రవేశాన్ని ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడమే కాకుండా, ఓ నటి పేరును ప్రస్తావిస్తూ అభ్యంతరకర రీతిలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో, ఆయనపై కేసు నమోదైంది.
Anitha Radhakrishnan Arrest | బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ..
తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పొందాలని అనితా రాధాకృష్ణన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో పోలీసులు శుక్రవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Anitha Radhakrishnan Arrest | రాజకీయ ప్రకంపనలు..
ఈ అరెస్టుపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష గళాన్ని నొక్కేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అణచివేత ధోరణిని అవలంబిస్తోందని ఆమె విమర్శించారు. ఒక ఎమ్మెల్యేను అరెస్టు చేయడం రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆమె ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Police Image | పోలీస్ ఇమేజ్ను పెంచేవిధంగా సిబ్బంది వ్యవహరించాలి..:సీపీ సాయిచైతన్య