TSLPRB Notification | త్వరలో పోలీస్​ ఉద్యోగాల నోటిఫికేషన్​

రాష్ట్రంలో పోలీస్​ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్​ వెలువడనుంది. ఈ మేరకు ప్రభుత్వం పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డుకు అనుమతి ఇచ్చింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TSLPRB Notification | రాష్ట్రంలో పోలీస్​ ఉద్యోగాల (Police Jobs) భర్తీకి త్వరలో నోటిఫికేషన్​ వెలువడనుంది. ఈ మేరకు ప్రభుత్వం పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు(TSLPRB)కు అనుమతి ఇచ్చింది.

రాష్ట్రంలో 5 వేల పోలీస్​ ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగాల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం 7 వేల పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నోటిఫికేషన్​ విడుదల చేయడానికి పోలీస్​ రిక్రూట్​మెంట్ బోర్డు చర్యలు చేపట్టింది. పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల ఖాళీలను, అగ్నిప్రమాద విపత్తు ప్రతిస్పందన, అత్యవసర, పౌర రక్షణ శాఖ, జైళ్ల శాఖ, ప్రత్యేక రక్షణ దళంలోని పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు.

TSLPRB Notification | పోస్టుల వివరాలు

సబ్ ఇన్​స్పెక్టర్ (సివిల్) 148, రిజర్వ్ సబ్ ఇన్​స్పెక్టర్ (AR) 14, రిజర్వ్ సబ్ ఇన్​స్పెక్టర్ (TGSP) 12, రిజర్వ్ సబ్ ఇన్​స్పెక్టర్ (SARCPL) 3, అసిస్టెంట్​ సబ్​ ఇన్‌స్పెక్టర్ (FPB) 23, పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) 3,697, పోలీస్​ కానిస్టేబుల్ (ఏఆర్​) 1,052, పోలీస్ కానిస్టేబుల్ (SARCPL) 24, పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పీటీవో 20, పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) పీటీవో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు.

TSLPRB Notification | అగ్నిమాపక శాఖలో..

TSLPRB Notification

స్టేషన్​ ఫైర్​ ఆఫీసర్​ 39, ఫైర్​ ఫైటర్స్​ 751 పోస్టులు, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్​ (మెన్​) 14, ఉమెన్​ 1, వార్డెన్​ (మెన్​) 196, వార్డెన్​ (ఉమెన్​) 12, ప్రత్యేక రక్షణ దళంలో 44 ఎస్సై, 1,380 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 7,437 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్​ రానుంది.

ఇది కూడా చదవండి..: Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలో కోట్ల అవినీతి : మంత్రి పొన్నం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *