అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Light Rain | తెలంగాణ (Telangana)లోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మంగళవారం 50 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు జిల్లాల్లో తేలికపాటి చిరుజల్లులు కురుస్తాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం పూట చెదురుమొదురు వాన పడుతుంది.
Telangana Light Rain | ఎల్నినో ప్రభావంతో..
రాష్ట్రంలో వరుణుడు ముఖం చాటేశాడు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి ఇటీవల మూడు రోజులు మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం వానలు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేసిన పంటలకు నీరు అందడం లేదు. చెరువులు, ప్రాజెక్టుల్లో సైతం నీరు లేదు. దీంతో బోరుబావుల కింద మాత్రమే ప్రస్తుతం వరినాట్లు వేస్తున్నారు. అయితే విద్యుత్ కోతలు, వర్షాలు లేకపోవడంతో వేసిన పంటలకు నీరు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Basara Temple Donation | బాసర అమ్మవారి అనుగ్రహానికి భక్తి కానుక.. గర్భగుడి నిర్మాణానికి రూ.31 కోట్ల మహాదానం