Telangana Heavy Rains | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Heavy Rains |  వర్షాల కోసం నిత్యం ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలకు వాతావరణ శాఖ గుడ్​న్యూస్​ చెప్పింది. నేడు తెలంగాణ (Telangana)లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ పనులు సాగడం లేదు. వరినాట్లు వేయడానికి అన్నదాతలు ఆలోచిస్తున్నారు. బోరుబావుల కింద నాట్లు వేసినా.. వాటికి నీరందడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వానాకాలం సీజన్​ ప్రారంభం అయ్యాక ఒకసారి కూడా వాగులు పారేట్లు వర్షం పడలేదు.

Telangana Heavy Rains | ఆ జిల్లాల్లో..

Telangana Heavy Rains

ఈ రోజు భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విస్తృతంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇతర జిల్లాలు తేలికపాటి వర్షాలు పడుతాయి. హైదరాబద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తేలికపాటి – మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Kollapur Principal Assault | విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి.. ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికిన విద్యార్థి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *