అక్షరటుడే, వెబ్డెస్క్ : Ananthababu Arrest | వైఎస్సార్సీపీ (YSRCP) ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి జిల్లా కోర్టు (Rajamandri Court) వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు కాకినాడ సర్పవరం పీఎస్‌కు తరలించారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. అనంతబాబు ఆ హత్య చేశాడని ఆరోపణలువ వచ్చాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. అయితే బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రలోభాలకు గురిచేశారని అభియోగాలు నమోదు చేశారు.
Ananthababu Arrest | బయటకు రాగానే..
బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ కోసం కోర్టుకు అనంతబాబుతో పాటు ఆయన భార్య లక్ష్మీదుర్గ శుక్రవారం వచ్చారు. విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు. అనంతరం కాకినాడ (Kakinada)లోని సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని రెండు రోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
దీనిని కూడా చదవండి : Power Reforms | విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు.. 300 మెగావాట్లకు పైగా అవసరమున్న ప్రైవేట్ కంపెనీలకు లైసెన్స్ అనుమతి