అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: LIC Retired Employee | సుమారు రూ. 3.50 కోట్లతో ఓ ఎల్ఐసి రిటైర్డ్ ఉద్యోగి పరారయ్యాడు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది.
LIC Retired Employee | నగరంలోని ఎల్ఐసీ కార్యాలయంలో..
నగరం (Nizamabad)లోని ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేసిన హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ ఇటీవల రిటైర్ అయ్యాడు. అయితే ఆయన గత రెండేళ్లుగా ఎల్ఐసీ ఏజెంట్ల వద్ద, కార్యాలయంలోని ఉద్యోగుల వద్ద అప్పులు చేశాడు. వారందరికీ రిటైర్మెంట్ అయిన మరుసటి రోజే డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇలా తనకు తెలిసిన రూరల్ ఎల్ఐసీ ఏజెంట్ల వద్ద రూ.లక్షల్లో వసూలు చేశాడు. సదరు ఉద్యోగి రిటైర్మెంట్ అయిన రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
LIC Retired Employee | గ్రాండ్‌గా రిటైర్మెంట్ ఫంక్షన్..
అందరి వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్న సదరు హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ జూన్ 30వ తేదీన ఎల్ఐసీ కార్యాలయంలోనే తన రిటైర్మెంట్ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించాడు. అందరికీ రిటైర్మెంట్ డబ్బులు రాగానే అప్పులు తీర్చేస్తానని మాట ఇచ్చాడు. జూలై 1వ తేదీన అకౌంట్లో డబ్బులు పడగానే వాటిని డ్రా చేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయాడు. దీంతో అప్పటివరకు డబ్బులు చెల్లిస్తాడని ఆయనపై ఆశలు పెట్టుకున్న ఏజెంట్లు, తోటి ఉద్యోగులు హతాశులయ్యారు. అయితే ఈనెల 2వ తేదీన ఫోన్ ఆన్ చేసిన సదరు రిటైర్డ్ ఉద్యోగి అందరికీ డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేనని.. 20శాతం మాత్రమే ఇస్తానని చెప్పడంతో అందరూ ఆ కమిట్మెంట్కు ఓకే అయ్యారు. అనంతరం ఆయన తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కనిపించకుండా పోయాడు.
LIC Retired Employee | ముందుగానే ఇల్లు, పొలాల అమ్మకం..
అయితే సదరు రిటైర్డ్ ఉద్యోగి ముందస్తు ప్రణాళిక ప్రకారం..తన ఇల్లు, పొలాలను విక్రయించినట్లు సమాచారం. నగరంలోని పంచముఖి హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్న తన ఇంటిని, అలాగే భూములను ఎవరికీ తెలియకుండా అమ్మేశాడు. ఇదంతా ప్రణాళిక ప్రకారం చేశాడని ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. రిటైర్మెంట్ డబ్బులు పడగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఏజెన్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: TRP Party Flag | టీఆర్పీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే గద్దెను కూల్చారు..