అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Meesala Srinivas Joins Jana Sena | నిజామాబాద్(Nizamabad) జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నేత సామాజిక కార్యకర్త మీసాల ఫౌండేషన్ అధినేత మీసాల శ్రీనివాసరావు జనసేనలో చేరారు. హైదరాబాద్ (Hyderabad)లో పవన్ కల్యాణ్ నివాసంలో పవన్ సమయంలో ఆయన పార్టీ కండూవా కప్పుకున్నారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ మీసాల శ్రీనివాస్ తమకు 20 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. అదే విధంగా మీసాల ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో సంతోషకరమని అన్నారు. అనంతరం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రజలకు చేరువై జనసేన సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం మీసాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు, ప్రజా సేవకు పార్టీ కట్టుబాటు పవన్ కల్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో చేరినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
Meesala Srinivas Joins Jana Sena | 20 ఏళ్లుగా మీసాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
జిల్లాలో 20 ఏళ్లుగా మీసాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీసాల శ్రీనివాసరావు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా నగరంలోని రైల్వేకమాన్ వద్ద డబుల్ రోడ్డు కోసం ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష అప్పట్లో సంచలనంగా మారింది. ఆయన చేసిన పోరాటం కారణంగా అప్పటి పాలకులు, అధికారులు రైల్వే కమాన్ వద్ద డబుల్ రోడ్డును మంజూరు చేశారు. అలాగే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా లక్ష మందికి పైగా ప్రజలకు ఉచితంగా బ్లడ్ గ్రూపింగ్, హిమోగ్లోబిన్ పరీక్షలను చేయించారు. అలాగే ప్రతి ఏడాది వేసవికాలంలో పోలీసులకు, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు బట్టర్ మిల్క్ అందజేశారు. ఫౌండేషన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా ఆయన కొనసాగిస్తున్నారు.
Meesala Srinivas Joins Jana Sena | ‘అక్కడ ఇక్కడ దుంకితే సస్తావ్’..
2007లో ఎయిడ్స్‌పై పెద్దఎత్తున మీసాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ ఫుల్ఫామ్గా ‘అక్కడ ఇక్కడ దుంకితే సస్తావ్’ అనే డైలాగ్‌ను ఆయన ప్రచారం చేశారు. . ఈ నినాదం ఎయిడ్స్‌పై యువతకు అవగాహన కల్పించడంలో ఉపయోగపడింది. జిల్లాలో విస్తృతంగా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడంతో ఆయనను అప్పటి గవర్నర్ ఎన్డీ తివారి సైతం ప్రత్యేక జ్ఞాపికతో సన్మానించారు.
Meesala Srinivas Joins Jana Sena | యువరాజ్యం ద్వారా ప్రజల్లోకి..
అనంతరం తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలనే ఉద్దేశంతో మీసాల శ్రీనివాసరావు అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యువరాజ్యం విభాగానికి ఆయన రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సేవలందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో 20 ఏళ్లుగా తనకు అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో చురుకైన కార్యకర్తగా సేవచేసే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందాడు.
మీసాల శ్రీనివాసరావు సతీమణి సైతం..
అలాగే మీసాల శ్రీనివాసరావు సతీమణి సవిత సైతం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె 19వ డివిజన్ కార్పొరేటర్‌గా సేవలందించారు. ఈ సందర్భంగా ఎక్కువ మొత్తంతో డివిజన్‌కు నిధులు తీసుకొచ్చి ప్రజలకు సేవచేశారు. ఇందులోనూ ఎలాంటి అవినీతికి తావులేకుండా డివిజన్లో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు.
దీనిని కూడా చదవండి : రెండేళ్లలో 71 వేల ఉద్యోగాలు ఇచ్చాం: పొంగులేటి