Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వానాకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Heat Wave | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వానాకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండాకాలాన్ని తలపించేలా ఎండలు కొడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడటం లేదు. మొన్నటి వరకు వానలు లేకున్నా.. వాతావరణం చల్లగా ఉంది. అయితే శుక్రవారం నుంచి ఎండ తీవ్రత పెరిగింది. ఈ నెల 15 వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వాతావరణం పొడిగా ఉండనుంది. తూర్పు తెలంగాణ (Telangana)లో 37 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఉత్తర తెలంగాణలో 35 నుంచి 37 డిగ్రీల ఎండతీవ్రత ఉంటుంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయి. ఆదివారం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవాకశం ఉంది.

Telangana Heat Wave | ఎత్తిపోతున్న బోర్లు

Telangana Heat Wave

వానలు లేకపోవడంతో వ్యవసాయ పనులు సాగడం లేదు. ముఖ్యంగా ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో.. వాటి కింద ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం బోరుబావులు ఉన్న రైతులు మాత్రమే వరినాట్లు, ఇతర పంటలు వేస్తున్నారు. అయితే రోజు రోజుకు ఎండలు మండుతుండటం, వానలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఫలితంగా బోర్లు ఎత్తిపోతున్నాయి. వేసిన పంటలకు నీరు అందడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో పది రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ సీజన్​లో పంటలు సాగు కష్టమేనని రైతులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..: Daivalaguda six murders | మానవ మృగం నరమేధం.. మొదట బాలికపై అఘాయిత్యం, హత్య.. షాబాద్​ హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *