బిజినెస్​Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్

Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్‌మీ ఫోన్

రియల్‌మీ మరో మోడల్‌ను వినియోగదారుల ముందుకు తెచ్చింది. నార్జో 100 లైట్ ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ.. నార్జో సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. నార్జో 100 లైట్ 5జీ మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. భారీ బ్యాటరీతో బడ్జెట్ ధరలో తీసుకువచ్చిన ఈ ఫోన్ అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉండనుంది. ఏప్రిల్ 21 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసేద్దామా..

Realme Narzo 100 Lite | డిస్‌ప్లే..

రియల్‌మీ నార్జో 100 లైట్ 6.8 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తోంది. 144 రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే పనిచేస్తుంది. ఐపీ64 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉంది.

Realme Narzo 100 Lite | ప్రాసెసర్..

  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
  • రియల్‌మీ ఎయిర్‌ఫ్లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది.

Realme Narzo 100 Lite | కెమెరా సెటప్..

ఇందులో 13 ఎంపీ ప్రధాన కెమెరాతో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా ఉంది.

బ్యాటరీ సామర్థ్యం..

  • ఇందులోని 7000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 15డబ్ల్యూ వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్‌డ్ వైర్డ్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్ సదుపాయాలూ ఉన్నాయి.
  • సింగిల్ చార్జ్‌తో 10 గంటల పాటు వీడియోలు ప్లే చేయొచ్చని, 70 గంటలపాటు మ్యూజిక్ వినొచ్చని కంపెనీ చెబుతోంది. 34 గంటల కాలింగ్, 12 గంటల గేమింగ్‌ను సపోర్ట్ చేస్తుందంటున్నారు.

వేరియంట్స్..

  • ఫ్రాస్ట్ సిల్వర్, థండర్ బ్లాక్ కలర్స్‌లో మూడు వేరియంట్లలో లభిస్తుంది.
  • 4జీబీ, 64జీబీ వేరియంట్ ధర రూ.13,499.
  • 4జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.14,499.
  • 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.16,499.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Chandrababu Pension Scheme | ఏడాదికి రూ. 33 వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే :సీఎం చంద్రబాబు

అక్షరటుడే, కృష్ణా జిల్లా: Chandrababu Pension Scheme | ఆంధ్రప్రదేశ్ (Andhra...

Mumbai Cocaine Seizure | ముంబైలో ఎన్సీబీ సంచలనం.. రూ.1,745 కోట్ల కొకైన్ సీజ్!

అక్షరటుడే, న్యూఢిల్లీ: Mumbai Cocaine Seizure | దేశ ఆర్థిక రాజధాని...

Air India Services Cut | ఎయిరిండియా కీలక నిర్ణయం.. పలు మార్గాల్లో సర్వీసుల తగ్గింపు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Air India Services Cut | పశ్చిమాసియాలో నెలకొన్న...

Attack on Trump | ట్రంప్‌పై దాడికి యత్నం.. షాకింగ్ వీడియో విడుదల, బయటపడిన నిందితుడి ప్లాన్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Attack on Trump | అమెరికాలో మరోసారి భద్రతా...