అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rainwater Harvesting | హైదరాబాద్ (Hyderabad) నగరంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీ వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి బాధ్యతగా స్వీకరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. గుట్టల బేగంపేటలోని బీవర్లీహిల్స్ లోని బీవర్లీ స్ప్రింగ్ అపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పునర్నిర్మించిన మూడు ఇంకుడు గుంతలను శనివారం ఆయన ప్రారంభించారు.
ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను కేవలం భవన నిర్మాణ అనుమతులు లేదా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందడం కోసమే నామమాత్రంగా ఏర్పాటు చేయవద్దని ఎండీ స్పష్టం చేశారు. ప్రతి భవనం పైకప్పుపై కురిసే వర్షపు నీటి ప్రతి చుక్కను అదే ప్రాంగణంలో భూమిలోకి ఇంకేలా శాస్త్రీయంగా రూఫ్‌టాప్ రేన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు, ఇంకుడు గుంతలు, రీఛార్జ్ పిట్లు నిర్మించాలని సూచించారు. ప్రభుత్వం, జలమండలి చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే నగరానికి శాశ్వత నీటి భద్రత సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Rainwater Harvesting | పెరిగిన ట్యాంకర్ బుకింగ్‌లు

గత ఏడాది వేసవిలో సుమారు 4 వేల అపార్ట్‌మెంట్లు జలమండలి ట్యాంకర్ నీటిని వినియోగించగా, ఈ ఏడాది ఆ సంఖ్య దాదాపు 12,500 అపార్ట్‌మెంట్లకు పెరిగిందని ఎండీ తెలిపారు. వర్షాలు కురుస్తున్న రోజుల్లోనూ కొన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ట్యాంకర్ బుకింగ్‌లు నమోదవుతున్నాయని చెప్పారు. ట్యాంకర్ బుకింగ్ వ్యవస్థ ద్వారా ప్రతి అపార్ట్‌మెంట్, భవనం, ప్రాంతానికి సంబంధించిన రోజువారీ నీటి అవసరాల డేటా జలమండలి వద్ద అందుబాటులో ఉందన్నారు. వర్షాలు ఆలస్యంగా కురవడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, బోర్లు ఎండిపోవడం ఇందుకు ప్రధాన కారణాలని వివరించారు.
ఇది కూడా చదవండి..: Ganjani Mafia Hyderabad | గంజాయి కలకలం.. చిన్నారులే లక్ష్యంగా మత్తు వ్యాపారం.. ఈగల్ ఫోర్స్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి!