Ferrari Car Crash | హైదరాబాద్​లో ఫెరారీ కారు బీభత్సం

హైదరాబాద్​ నగరంలో ఫెరారీ స్పోర్ట్స్​ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ఓ ఇంటి గేటును ఢీకొంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ferrari Car Crash | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఫెరారీ స్పోర్ట్స్​ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ఓ ఇంటి గేటును ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది.

ఫిలింనగర్‌ (Film Nagar)లో సైట్-2, రోడ్ నంబర్ 5లోని హిల్ వ్యూ అపార్ట్‌మెంట్ గేటును ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫెరారీ కారు ఢీకొంది. ఓవర్​ స్పీడ్​తో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులోని యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో కారును అక్కడే వదిలేసి వారు పారిపోయారు.

Ferrari Car Crash | స్టేషన్​కు తరలింపు

గేటును ఢీకొనడంతో ఫెరారీ కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కారు స్పీడ్ 120 కి.మీ. దాటొచ్చని సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్రేన్​ సాయంతో కారును పోలీసు స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నగరంలో ఇటీవల లగ్జరీ కార్లతో కొందరు యువకులు బీభత్సం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా బడా బాబుల పిల్లలు ఖరీదైన కార్లతో రోడ్లపై రయ్యుమని దూసుకెళ్తున్నారు. మద్యం మత్తులో అతివేగంగా వెళ్తూ..ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఖరీదైన కార్లు కావడంతో ప్రమాదాలు జరిగినా అందులోని వారికి ఏమి కావడం లేదు. అయితే వారి మూలంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనిని కూడా చదవండి : Kaleshwaram Project Restoration | తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు పునరుద్ధరణ పనులు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *