అక్షరటుడే వెబ్‌డెస్క్: Warangal Airport | వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy )అధికారులను ఆదేశించారు. 2028 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రెండు విమానాశ్రయాలను పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. వరంగల్ విమానాశ్రయ రూపకల్పనలో కాకతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Warangal Airport | దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశ జనాభాలో కేవలం 2.5 శాతం ఉన్న తెలంగాణ, దేశ జీడీపీలో మాత్రం 5 శాతం వాటాను అందిస్తూ ఆర్థికంగా కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానాశ్రయాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
Warangal Airport | కేంద్రంతో సమన్వయం..
విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరం చర్చిస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘ఫెడరల్ స్ఫూర్తి’తో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని ఆయన వివరించారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో క్రమం తప్పకుండా ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులను కలిసి, రాష్ట్ర సమస్యలు , ప్రాజెక్టులపై చర్చిస్తుంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Keerthana Menon Marriage | పెళ్లి కోసం ఒత్తిడి.. గుండు గీయించుకున్న యువతి