Dr L Ramulu | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎల్. రాములు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dr L Ramulu | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ ఎల్. రాములు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటి వరకు ఇంఛార్జి హోదాలో విధులు నిర్వర్తించిన డాక్టర్ ఎల్. రాములు, తాజాగా పూర్తి అదనపు (Full Additional) బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Gandhi Medical College Vice Principal | గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ బి.వి. నాగమోహన్ రావు నియామకం

Dr L Ramulu | పరిపాలనా వ్యవహారాల పర్యవేక్షణ

డాక్టర్ ఎల్. రాములు ఆర్థోపెడిక్స్ విభాగాధిపతిగా సేవలు అందిస్తూనే, ఇకపై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పరిపాలనా వ్యవహారాలను కూడా పర్యవేక్షించనున్నారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో ఆసుపత్రి సేవలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *