అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CV Anand DGP | తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి (Shivadhar Reddy) ఈ నెల 30న రాజీనామా చేయనున్నారు. దీంతో 1991 బ్యాచ్ ఐపీఎస్ (IPS) అధికారి సీవీ ఆనంద్‌కు ఆ బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
సీవీ ఆనంద్ ప్రస్తుతం ప్రస్తుతం హోం శాఖ (Home Department) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఆ స్థానంలో శిఖా గోయల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీవీ ఆనంద్‌ను డీజీపీ చేయనుండటంతోనే ఆ స్థానంలో శిఖా గోయల్ (Shika Goel)ను నియమించినట్లు సమాచారం. మే 1న సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.
CV Anand DGP | సీవీ ఆనంద్ నేపథ్యం
సీవీ ఆనంద్ రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో చదువుకున్నారు. 1991లో ఐపీఎస్ సెలెక్ట్ అయి.. 1993లో వరంగల్ రూరల్ అడిషనల్ ఎస్పీగా సీవీ ఆనంద్ కెరీర్ ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్ ఎస్పీగా పని చేశారు. నక్సల్స్‌కు వ్యతిరేక ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించారు. గతంలో హైదరాబాద్ సీపీగా పని చేసి ఆయన ఇటీవల హోంశాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. 2028 జూన్ వరకు సర్వీస్‌లో ఉంటారు. దీంతో ఆయన డీజీపీగా బాధ్యతలు చేపడితే రెండేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది.
దీనిని కూడా చదవండి: IPS Transfers | రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్‌ల బదిలీ..


[…] ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను(CV Anand) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం […]