అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Delhi Visit | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బుధవారం ఉదయం ఢిల్లీకి బయలు దేరారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు ఆయనతో పాటు వెళ్లారు.
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని బీఆర్ఎస్ పార్టీ బృందం కలవనుంద.ఇ ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని వారు కోరనున్నారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ 1984 నుంచి 1998 వరకు పని చేసింది. 1998లో ఫ్యాక్టరీ మూతబడింది. దీనిని పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో 3వేల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో స్థానికులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని కలవనున్నారు.
KTR Delhi Visit | హస్తీనాలో రాజకీయాలు

రాష్ట్ర నేతలు ఢిల్లీలో మకాం వేయడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజులు ఢిల్లీలో పర్యటించారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రాజెక్ట్‌లకు సహకారం అందించాలని కోరారు. మరోవైపు తాజాగా బీఆర్ఎస్ నాయకులు సైతం ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. బీజేపీ నాయకులు సైతం ఇటీవల కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రంలో సమస్యలపై చర్చించారు. దీంతో మూడు ప్రధాన పార్టీల నాయకులు కేంద్ర పెద్దలను కలుస్తుండటంపై రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండి..: Telangana Rains Today | రైతులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి వర్షాలు