Amaravati Land Case | సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలకు హైకోర్టులో భారీ ఊరట

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి నారాయణలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Amaravati Land Case | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి నారాయణలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం (POT Act) ఉల్లంఘనలు జరిగాయని, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ సీఐడీ అధికారులు అప్పట్లో చంద్రబాబు, నారాయణలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘంగా జరిగిన విచారణ అనంతరం, న్యాయస్థానం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఈ కేసులు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే, తగిన ఆధారాలు లేకుండా నమోదు చేశారన్న డిఫెన్స్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఈ మేరకు సదరు కేసును పూర్తిగా క్వాష్ చేస్తూ న్యాయమూర్తి తుది తీర్పు ఇచ్చారు.

Amaravati Land Case | టీడీపీ శ్రేణులు హర్షం ..

హైకోర్టు ఇచ్చిన ఈ క్లీన్ చిట్ తీర్పు కూటమి ప్రభుత్వ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అమరావతి నిర్మాణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, రాజకీయ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసిందని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

babu 1

Amaravati Land Case | రాజకీయ ప్రాధాన్యత..

ఈ తీర్పు ద్వారా అమరావతి రాజధాని ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేసిన ఆరోపణలకు చెక్ పడినట్లైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన ఈ క్లీన్ చిట్, భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి పనులకు మరింత ఊతాన్ని ఇస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇది కూడా చదవండి:  Enumeration Forms | ఎన్యుమరేషన్ ఫారాలను త్వరితగతిన సమర్పించాలి : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *