అక్షరటుడే, వెబ్‌డెస్క్: Realme Narzo 100x | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ అయిన రియల్‌మీ తన నార్జో సిరీస్‌లో మరో మోడల్‌ను భారత మార్కెట్‌లో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసింది. భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో దీనిని తీసుకువచ్చారు. అమెజాన్ (Amazon), కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు ప్రముఖ రిటైల్ దుకాణాలలో ఈనెల 22 నుంచి సేల్ ప్రారంభం కానుంది. మÖడు వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.81 ఇంచ్ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్‌ప్లేతో వచ్చిన ఫోన్.. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 1600 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ ఉంది.
సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
Realme Narzo 100x | కెమెరా సెటప్ ..
వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
Realme Narzo 100x | బ్యాటరీ సామర్థ్యం..
8000 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ అమర్చారు. ఇది 45 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. నాలుగేళ్ల నిరంతర వాడకం తర్వాత కూడా ఈ బ్యాటరీ తన సామర్థ్యంలో 80 శాతాన్ని నిలుపుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 26 గంటలపాటు యÖట్యూబ్ బ్రౌజ్ చేయవచ్చని, 170 గంటలపాటు మÖ్యజిక్ వినవచ్చని పేర్కొంటోంది.
వేరియంట్లు: ఫ్లాష్ ఆరంజ్, మిడ్ నైట్ బ్లాక్ కలర్స్‌లో మÖడు వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది.
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ. 18,499
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ. 20,499
6 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ. 22,499
ఇది కూడా చదవండి..: July 15 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తాజా గోల్డ్ రేట్లు ఇవే