Indian Stock Market | లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం లాభాల బాటలో సాగుతోంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 282 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం లాభాల బాటలో సాగుతోంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 282 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Indian Stock Market | పాజిటివ్‌గా దేశీయ స్టాక్ మార్కెట్

పశ్చిమాసియాలో జియో పొలిటికల్ ఉద్రిక్తతలతో నాలుగు రోజులుగా పెరుగుతున్న ముడి చమురు ధర.. గురువారం కాస్త తగ్గింది. దీనికితోడు ఐటీ షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ పాజిటివ్‌గా స్పందిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 203 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా ప్రాఫిట్ బుకింగ్‌తో 112 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 303 పాయింట్లు పెరిగింది. 64 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. మొదట్లో 45 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్దనుంచి కోలుకుని 89 పాయింట్లు పైకి ఎగబాకింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో 77,467 వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 24,149 వద్ద ఉన్నాయి.

Indian Stock Market

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 23 స్టాక్స్ లాభాలతో, 7 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్సీఎల్ టెక్ 2.09 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.71 శాతం, టెక్ మహీంద్రా 1.68 శాతం, టైటాన్ 1.61 శాతం, ఎం అండ్ ఎం 1.58 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎటర్నల్ 2.22 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.89 శాతం, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ 0.33 శాతం, బీఈఎల్ 0.29 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.26 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: July 16 Gold Prices | బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల.. 24 క్యారెట్ల గ్రాము గోల్డ్​ ఎంతంటే!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *