అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Fake Documents | ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటిని ఇతరుల పేరిట మార్చిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు (Nizamabad Police) అరెస్ట్ చేశారు. ఈ మేరకు మూడో టౌన్ ఎస్సై హరిబాబు వివరాలు వెల్లడించారు.
Fake Documents | డాక్యుమెంట్ రైటర్ సాయంతో..
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మూడోటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో నివాసముండే మహిళ భర్త గతంలో మరణించాడు. అతడి పేరిట అదే కాలనీలో 50 గజాల స్థలంలో ఇల్లు ఉంది. భర్త మరణించిన అనంతరం ఆమె తన బంధువుల ఇళ్లలోనే ఉంటోంది. దీంతో ఖాళీ ఇంటిని గమనించిన ఇర్ఫాన్, సలీం, శివకుమార్, పోశెట్టి, శ్రీనివాస్ ఐదుగురు వ్యక్తులు కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. అనంతరం ఇతరుల పేరిట మార్చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు బాధితురాలు మూడో టౌన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం ఈ ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
ఇది కూడా చదవండి..: Dalit Sarpanch Attack Dichpally | అధికార గర్వం.. అగ్రకుల అహంకారం!.. నిధుల దుర్వినియోగాన్ని ప్రశ్నించిన దళిత ఉప సర్పంచిపై మహిళా సర్పంచి భౌతిక దాడి.. ఆమె భర్త బూతు పురాణం