అక్షరటుడే, వెబ్డెస్క్ : Kalma Homework Controversy | హైదరాబాద్ (Hyderabad) ఓల్డ్ సిటీలో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో హిందూ విద్యార్థులకు కల్మా పఠించాలని హోం వర్క్ ఇచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు స్పందించారు.
ఓల్డ్ సిటీలోని సక్సెస్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థికి కల్మా పఠించాలని హోం వర్క్ ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీహెచ్ మాట్లాడుతూ.. పిల్లలతో కల్మాను పఠించేలా బలవంతం చేస్తున్న ఒక ముస్లిం ఉపాధ్యాయుడు ఉన్నారన్నారు. ఇది మతపరమైన అంశం అని, పాఠం బోధించే నెపంతో వారు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను ఇలా బలవంతం చేయడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని సూచించారు.
Kalma Homework Controversy | బడుల్లో అలా చేయొద్దు
ఇది ఇలాగే కొనసాగితే, ఇతరులు కూడా ప్రతిస్పందనగా హిందూ భావనలను లేవనెత్తడం మొదలుపెడతారని వీహెచ్ అన్నారు. ఇది అరాచకానికి దారితీస్తుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ తమ సొంత హక్కులు ఉంటాయన్నారు. వారు తమ ఇళ్లలో తమకు నచ్చిన ఆచారాలను పాటించవచ్చు, కానీ విద్యాసంస్థల లోపల అలా చేయకూడదని స్పష్టం చేశారు. హోం శాఖ దీనిని తీవ్రంగా పరిగణించి, ఇటువంటి ధోరణులను సహించకుండా చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలను ఆయన కోరారు. ఇది అనవసరమైన చర్య అని, కొత్త సమస్యలకు దారితీస్తుందన్నార.ఉ తక్షణమే స్పందించి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినందుకు అభినందించారు.ఇటువంటి కార్యకలాపాలు శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తాయని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా పిల్లలే నష్టపోతారని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లోనూ ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
ఇది కూడా చదవండి..: Nacharam Lake | నాచారం చెరువు అభివృద్ధికి హైడ్రా శ్రీకారం