అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana EHS Portal | తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత (Cashless) వైద్య చికిత్సల కలను నిజం చేస్తూ, ప్రభుత్వం నూతన ఆరోగ్య పథకం (EHS) పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి ఈ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులే కీలమని, వారి ఆరోగ్యం పట్ల తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Telangana EHS Portal | సులభతర వైద్యం..
సుమారు 9.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల ఆరోగ్య అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ నూతన విధానాన్ని రూపొందించారు. గతంలో వైద్య ఖర్చుల భారం మోయలేక ఇబ్బందులు పడిన ఉద్యోగులకు, ఇకపై ఈ నగదు రహిత చికిత్స విధానం కొండంత అండగా నిలవనుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం పొందేలా ఈ పథకం మార్గం సుగమం చేసింది.
Telangana EHS Portal | గత తప్పిదాల సవరణ..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య బిల్లులను పట్టించుకోకుండా పెండింగ్‌లో పెట్టిందని భట్టి విక్రమార్క విమర్శించారు. అయితే, తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధ్యతతో వ్యవహరించి, దాదాపు రూ. 2 వేల కోట్ల బకాయిలను క్లియర్ చేశామని ఆయన వివరించారు. ఇదే స్ఫూర్తితో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
Telangana EHS Portal | ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు..
రాష్ట్రంలో విద్య , వైద్య రంగానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచి, సుమారు 1.06 కోట్ల మంది పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఇదే తరహాలో ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ఒక నూతన అధ్యాయంగా భావిస్తూ, భవిష్యత్తులోనూ మెరుగైన సేవలందించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
–> తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నూతన ఆరోగ్య పథకం (EHS) ప్రారంభం
–> సచివాలయంలో హెల్త్ పోర్టల్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ
–> ఉద్యోగులకు నూతన హెల్త్ కార్డులను అందజేసిన డిప్యూటీ సీఎం
–> రాష్ట్రవ్యాప్తంగా 886… pic.twitter.com/rQw3pq5zT1
— RTV (@RTVnewsnetwork) July 17, 2026
ఇది కూడా చదవండి: Stock Market Today | దూసుకెళ్లిన సూచీలు.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు