అక్షరటుడే వుబ్‌డెస్క్: Telangana Bar Timings | ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్స్ సందడిని దృష్టిలో ఉంచుకుని, ఫుట్‌బాల్ అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు వీలుగా, రాష్ట్రంలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని బార్లు, క్లబ్బులు , మైక్రోబ్రూవరీల పని వేళలను పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Bar Timings | అమ్మకాల వేళలు ..
ఈ వేళల పొడిగింపు ముఖ్యంగా రెండు కీలక మ్యాచ్‌లకు వర్తిస్తుంది
జులై 18-19 రాత్రి: ఫిఫా వరల్డ్ కప్ 2026 థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా, 19వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి లభించింది.
జూలై 19-20 రాత్రి: ఫైనల్ మ్యాచ్ సందర్భంగా, 20వ తేదీ తెల్లవారుజామున 3:00 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చు.
Telangana Bar Timings ఎవరికి వర్తిస్తుంది?
ఈ ప్రత్యేక వెసులుబాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్న 2B బార్లు, C1 క్లబ్బులు, TD1 & TD2 (ఇన్-హౌస్) , మైక్రోబ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి. హరి కిరణ్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. కర్ణాటక ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్న క్రమంలో, తెలంగాణ ప్రభుత్వం అదే బాటలో సాగుతూ ఫుట్‌బాల్ అభిమానుల కోసం ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే, పొడిగించిన ఈ సమయాల్లో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా తెలంగాణలో తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలు
ఇటీవలే ఇదే తరహా నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం..కర్ణాటక బాటలోనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం
18వ తేదీన జరిగే ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల వరకు… pic.twitter.com/09ozORNOOE
— Telugu Scribe (@TeluguScribe) July 17, 2026
ఇది కూడా చదవండి: Telangana EHS Portal | ఉద్యోగులకు ఇక నగదు రహిత వైద్యం: భట్టి విక్రమార్క