అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dharani Investigation | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ (Dharani Portal) పేరిట భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై విచారణకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరణి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నారు. జగిత్యాల జిల్లాలో డిగ్రీ కాలేజ్‌లో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పటాన్చెరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Dharani Investigation | పంచాయతీలకు గుడ్ న్యూస్
మంత్రివర్గం గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణకు ఆమోదం తెలిపింది. ఇది అమలులోకి వస్తే పంచాయతీల సొంత నిధులు జీపీ ఖాతాలో జమ కానున్నాయి. గతంలో ట్రెజరీలో జమ చేసే నిబంధన ఉండగా.. తాజాగా ప్రభుత్వం దానిని సవరించింది. పంచాయతీలకు పన్నులు, ఇతర వనరుల ద్వారా ఆదాయం వస్తోంది. అయితే ఈ నిధులను నేరుగా వినియోగించుకునే అవకాశం లేక పాలకవర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఆ నిధులను ట్రెజరీలో జమ చేసి, అనంతరం బిల్లులు లేపాల్సిన పరిస్థితి ఉండటంతో చిన్న చిన్న పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ నిధులను పంచాయతీ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని మంత్రివర్గం తెలిపింది.
Dharani Investigation | ఎల్‌నినోపై చర్చ
మంత్రివర్గ సమావేశంలో ఎల్‌నినోపై చర్చించారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటలపై మంత్రులు మాట్లాడారు. బులెట్ ట్రైన్ అలైన్మెంట్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
దీనిని కూడా చదవండి : Murder Case Verdict | హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష