Mexico Earthquake 7.4 | మెక్సికో తీరంలో భారీ భూకంపం.. రిక్టర్​ స్కేల్​పై 7.4 తీవ్రత నమోదు.. సునామీ ప్రమాదం!

దీని కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉండటంతో ప్రకంపనలు విస్తృత ప్రాంతంలో తీవ్రంగా అనిపించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mexico Earthquake 7.4 | మెక్సికో Mexico దక్షిణ పసిఫిక్ తీరానికి సమీపంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదైంది. భూకంప కేంద్రం మెక్సికోలోని ప్యూర్టో మడెరో (Puerto Madero) పట్టణానికి పశ్చిమ-దక్షిణ (WSW) దిశగా సుమారు 71 కిలోమీటర్ల దూరంలో నమోదైంది.

Mexico Earthquake 7.4 | ప్రభావం ఎక్కువే..

భారత కాలమాన ప్రకారం.. భూకంపం 2026 జులై 17న రాత్రి 8 గంటల 18 నిమిషాలకు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. దీని కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉండటంతో ప్రకంపనలు విస్తృత ప్రాంతంలో తీవ్రంగా అనిపించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Dr. Anil Menon | అంతరిక్షంలోకి మరో ఇండియన్​.. ఎవరంటే..!

Mexico Earthquake 7.4 | నష్టం అంచనాలు..

భూకంప కేంద్రం అక్షాంశం 14.400° ఉత్తరం, రేఖాంశం 93.000° పడమరగా నమోదైంది. భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎంత మేరకు సంభవించిందనే అంశంపై అధికారులు ఇంకా పూర్తి సమాచారం వెల్లడించలేదు.

సముద్ర ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం నేపథ్యంలో సునామీ ప్రమాదంపై సంబంధిత సంస్థలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రజలు అధికారిక హెచ్చరికలు, సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *