అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vikram 1 Launch | శ్రీహరి కోట నుంచి విక్రమ్-1 రాకెట్‌లో నింగిలోకి దూసుకెళ్లింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేట్ సంస్థ రూపొందించిన ఈ రాకెట్ కొంత ఆలస్యంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాన్ని చివరి నిమిషంలో శాస్త్రవేత్తలు నిలిపివేశారు. హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్–1 రాకెట్‌ను తయారు చేసింది. ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో దీనిని రూపొందించారు. శ్రీహరికోట నుంచి శనివారం ఉదయం 11:30 గంటలకు జరగాల్సిన ఈ ప్రయోగం, చివరి నిమిషంలో తలెత్తిన సమస్యలతో ఆగిపోయింది. అనంతరం సమస్యను పరిష్కరించాక రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
Vikram 1 Launch | ఆలస్యంగా..
‘మిషన్ ఆగమన్’ అని పేరు పెట్టిన ఈ ప్రయోగం ఉదయం 11:30 గంటలకు జరగాల్సి ఉండగా, మధ్యాహ్నం 12:05 గంటలకు చేపట్టారు. ఈ రాకెట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ఒక స్మారక కార్డుపై ముద్రించిన “వందేమాతరం” అనే ప్రత్యేక సందేశాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళుతుంది. ప్రధానమంత్రి మోదీ మొట్టమొదటి ప్రైవేటు ప్రయోగ వాహనమైన విక్రమ్-1 తొలి కక్ష్య ప్రయోగాన్ని ప్రశంసించారు. దీనిని దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక “చారిత్రాత్మక నూతన ముందడుగు”గా, భారత యువత ప్రతిభకు, పారిశ్రామిక స్ఫూర్తికి ప్రతిబింబంగా ఆయన అభివర్ణించారు. ‘విక్రమ్-1’ ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు.
ఇది కూడా చదవండి..: Rain Deficit Farmers | కరుణించని వరుణుడు.. ఆందోళనలో రైతులు