SIR Forms | ఎస్​ఐఆర్​ ఫారాలు తిరిగివ్వకుంటే ఓటు హక్కు కోల్పోతాం : యెండల లక్ష్మీనారాయణ

ఎస్​ఐఆర్ ఫారాలను బీఎల్​వోలకు తిరిగి అందజేసి ప్రజలను తమన ఓటుహక్కును కాపాడుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,కోటగిరి : SIR Forms | ఎస్​ఐఆర్(SIR)​ ఫారాలను బీఎల్​వోలకు తిరిగి అందజేసి ప్రజలను తమన ఓటుహక్కును(Voter Registration) కాపాడుకోవాలని బీజేపీ(BJP) రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ(Yendala Lakshminarayana) అన్నారు. శనివారం పోతంగల్ మండల కేంద్రంలో ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్​లో బీజేపీ నాయకులతో కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

SIR Forms | రైతులు ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలి

ఆయన మాట్లాడుతూ.. సర్ నమోదు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గడువు వచ్చేనెల 3వ తేదీ వరకు పొడిగించినప్పటికీ ఫారాలను త్వరగా బీఎల్​వోలకు అందిస్తే డిజిటలైజేషన్​ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఎల్​నినో ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉందన్నారు. వర్షాలు ఆశించిన రీతిలో పడట్లేదు కాబట్టి రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని యెండల సూచించారు. జొన్నలు, శనగలు, నువ్వులు తదితర పంటలు సాగు చేయాలన్నారు.

అనవసరంగా ఖర్చులు పెంచుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు. నీటి కరువును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల కోసం పీఎం ఫసల్ యోజన బీమా పథకాన్ని అమలు చేసి పంట నష్టపోయిన రైతులకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్), ఓమన పటేల్, సంతోషం పటేల్, మక్కయ్య, శంకర్, విజయ్, నాగయ్య, నహీముద్దీన్, అశోక్, శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.

SIR Review Bheemgal 1

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *